Take a fresh look at your lifestyle.

4 కో-ఆప్షన్ సభ్యుల పదవులకు 12 నామినేషన్లు  కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ 

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ తరపున రాగి వనజ, కొర్వి రాములు, సయ్యద్ తాహిర్ అలీ, గౌడిచెర్ల అనూష నామినేషన్లు సమర్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్, పట్టణ పార్టీ అధ్యక్షులు మందుగుల గంగాధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్,
మాజీ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు మ్యాడం బాలకృష్ణ, కౌన్సిలర్లు గంట సంపత్, ఎండి మన్సూర్, శివరామకృష్ణ, హరిత నర్సింగ్ రావు, ముత్యంగౌడ్, మాజీ కౌన్సిలర్ గేలెన్,  జాయిముర్రే, క్రాంతి దీప్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ తరపున అభ్యర్థులు వంజరి జయరాజ్, మెంగాని విజయలక్ష్మి, నౌషిన్, ఫాజిల్ దరఖాస్తులు కమీషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో
మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కో-కన్వీనర్ గడ్డమీది కృష్ణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బట్టి ఉదయ్ కుమార్, జుబేర్ అహ్మద్, సోహెల్, దీపక్ కుమార్,మాజీ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం,మాయ మల్లేశం, విజయలక్ష్మి,నాయకులు సాయి కుమార్, శ్రీను నాయక్, వేణు తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.