యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణిలో బుధవారం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేసిన ఏరియా కార్మిక వర్గానికి సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. అశోక్ విప్లవజేజే లు తెలిపారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉదయం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సమ్మెతో నైనా గుణపాఠం తెచ్చుకోవాలని, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. సమ్మెలో సంపూర్ణంగా పాల్గొన్న ఏరియా కార్మిక వర్గానికి ఇఫ్టు పక్షాన ఆయన విప్లవ అభివందనాలు తెలియజేశారు. సింగరేణి కార్మిక వర్గానికి మద్దతుగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల సంఘం సభ్యులు బుచ్చమ్మ, ఆర్. లక్ష్మి, ఎం. రమా, దుర్గం పోచం, ఎన్. లక్ష్మి, కవిత, మంజుల, భవాని, సిహెచ్. శంకర్, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
