ముద్ర కూకట్‌పల్లి :
కేపీహెచ్‌బీ డివిజన్ 4వ ఫేస్‌లోని సిద్ధి వినాయక దేవాలయం వేదికగా బుధవారం మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుకు ఘనంగా ఆత్మీయ పౌర సన్మానం నిర్వహించారు. 4వ ఫేస్ మహిళా మండలి, కాలనీ అసోసియేషన్ మరియు ఆలయ కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని దీవించారు. అనంతరం కాలనీ సభ్యులు శ్రీనివాసరావును శాలువాతో సత్కరించి గౌరవించారు.
ఈ సందర్భంగా మందడి శ్రీనివాసరావు మాట్లాడుతూ:
”ప్రజల ఆశీస్సులతో కార్పొరేటర్ గా ఉన్న సమయంలో డివిజన్‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్దాం అని అయాన అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.