Take a fresh look at your lifestyle.

జంతు ప్రేమతో పశు ఔషధ విరాళం.

 

ముద్ర ప్రతినిధి , కోదాడ …. కోదాడ పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ప్రాణసంరక్షణ, పశుపోషకులకు చేయూతతో లాభసాటి పశుపోషణ లక్ష్యంగా నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ సేవలకు ఆకర్షితులైన కోదాడ పట్టణానికి చెందిన నిస్సార్ అహ్మద్ నేను సైతం జంతు ప్రేమలో ముందుంటానని , పశువులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే పశు ఔషధాలను విరాళంగా బుధవారం అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య కు అందించారు . ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ ను డాక్టర్ పెంటయ్య అభినందించారు. దాతల సహకారంతో నిర్వహిస్తున్న పశు ఔషధ బ్యాంక్ సేవలను ఇటీవల జిల్లా కలెక్టర్ సైతం ప్రశంసించారని, నిస్సార్ అహ్మద్ విరాళం ఎంతో విలువైనదని , పశు ఔషధ బ్యాంక్ ద్వారా మూగ జీవాల రక్షణకు సహకరిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మూగ జీవాలపై ప్రతి ఒక్కరూ ప్రేమ , జాలి , దయ కలిగి ఉండాలని , వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత గా గుర్తెరగాలని అన్నారు . ఈ కార్యక్రమములో సిబ్బంది రాజు, చంద్రకళ , శివ, సాగర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.