ముద్ర ప్రతినిధి , కోదాడ ….
కోదాడ మున్సిపాలిటీ పరిధిలో సిపిఎస్ స్కూల్ నందు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం 32 వ వార్డు కౌన్సిలర్ పాశం శ్రీనివాసరావు , 34 వ వార్డు కౌన్సిలర్ పందిపోటు స్వప్న , 35 వార్డు కౌన్సిలర్ పార సత్యవతి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని , నిరుపేదలకు సన్న బియ్యం ఇచ్చి ఎందరో పేదల ఆకలి తీరుస్తుందని , ముందు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ద్వారా మహిళలతో పాటు ప్రతి ఆడబిడ్డ లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో ఆర్పీలు శ్రీలత , సునీత , ధనమ్మ తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.