Take a fresh look at your lifestyle.

కొలువు దీరిన రేణుక ఎల్లమ్మ దేవాలయ నూతన పాలకవర్గం -ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

 

 

 ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని కొత్లాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. దేవాలయ కమిటీ చైర్మన్ గా ప్రవీణ్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన అందరికీ శుభాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దుల్లో వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ దర్శనార్థం  అనునిత్యం వేలాది సంఖ్యలో తెలంగాణ ప్రాంతం నుండి కాకుండా కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు ఇచ్చటకు వస్తుంటారని కావున దేవాలయ అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు తోడ్పాటునందిస్తానని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ వెబ్ సైట్లో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని చేర్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఆలయ అభివృద్ధి కొరకు నూతన పాలకవర్గం కృషిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రకళ, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు రవి గౌడ్, పట్లోళ్ల బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల నరసింహులు, మాజీ దేవాలయ చైర్మన్ బసిరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.