Take a fresh look at your lifestyle.

బోడుప్పల్ లో వనమహోత్సవం

  • మొక్కలు నాటిన కమిషనర్ శైలజ

బోడుప్పల్, ముద్ర విలేకరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు పరుస్తున్న వంద రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం బోడుప్పల్ నగర పాలక సంస్థలో వనమహోత్సవం నిర్వహించారు. బోడుప్పల్ కార్పొరేషన్ నాలుగో డివిజన్ లోని శ్రీలక్ష్మీనగర్ ఉద్యానవనం స్థలంలో స్థానిక పెద్దలతో కలిసి కార్పొరేషన్ కమిషనర్ శైలజ మొక్కలు నాటారు. కమిషనర్ తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిశోర్ గౌడ్, శానిటరీ ఇన్ స్పెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర అధికారులు, వార్డు ప్రజలు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.