Take a fresh look at your lifestyle.

ఇంటి యజమాని మరణిస్తే రూ.20 వేల సాయం

  • బోడుప్పల్ కార్పొరేషన్ లో వివరాలు నమోదు – కమిషనర్ శైలజ

బోడుప్పల్, ముద్ర విలేకరి: నిరుపేద కుటుంబంలో సంపాదనాపరుడైన ఇంటి యజమాని మరణిస్తే, ఆ కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ.20 వేల ఆర్థిక సాయం అందుతుందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎ.శైలజ తెలిపారు. మరణించిన వ్యక్తి ఆ ఇంట్లో ప్రధాన సంపాదనపరుడై వుండాలని, 18 నుంచి 60 ఏళ్ల వయసు కలిగిన వారికే ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం కల్పించే ఈ సాయానికి అర్హులైన కుటుంబాల వారు మరణించిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుడి  ఆధార్ కార్డు, కుటుంబ రేషన్ కార్డుల కాపీలను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించి దరఖాస్తు చేయాల్సివుంటుంది. ఆగస్టు 6వ తేదీ లోగా ఈ దరఖాస్తులను అందించాలని కమిషనర్ శైలజ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.