ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో బుధవారం హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల కోసం వైద్య పరీక్షలు మరియు టీకా శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ఫరీద్ అహ్మద్ తెలిపారు.
హజ్ యాత్రకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, యాత్రను సాఫల్యంగా పూర్తి చేయడానికి ప్రతి యాత్రికుడు సహకరించాలని ఆయన కోరారు.
ఈ శిబిరంలో జిల్లా జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్ బాబు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్ నాయక్, హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ ఓరుగంటి శ్రీనివాసులు, డాక్టర్ సూర్యనారాయణ, ఆర్ఎంఓ డాక్టర్ అజీమ్ తదితరుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు మరియు టీకాల కార్యక్రమం నిర్వహించారు.
మొత్తం 9 మంది హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలతో పాటు అవసరమైన టీకాలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ కార్యదర్శి అల్హాజ్ మహమ్మద్ ఇబ్రహీం, ఉపాధ్యక్షులు షంషీర్ ఖాన్, యూసుఫ్ గిలిమి, అబ్దుల్ హక్, ప్రచార కార్యదర్శి షేక్ నూరుల్ హక్, సభ్యులు సయ్యద్, ఎజాజ్ నక్షబంది వల్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.