Take a fresh look at your lifestyle.

​వివేకానంద నగర్ శ్రీవారి బ్రహ్మోత్సవాలు: ఘనంగా శాంతి కళ్యాణ మహోత్సవం

 

ముద్ర  కూకట్‌పల్లి : కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి

దేవాలయంలో 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కోసూరి

రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండువగా నిర్వహించారు.

​​ఈ కళ్యాణోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షులు వడ్డేపల్లి రాజేశ్వరరావు – యామిని దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొన్న వారు, భక్తులతో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

​ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి ఏటా భక్తుల అచంచల విశ్వాసంతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు సమాజంలో ఆధ్యాత్మిక శాంతిని, ఐక్యతను పెంపొందిస్తాయని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు

Leave A Reply

Your email address will not be published.