ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల్ వద్ద కారు – ఆటో ఢీకొన్న సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.


పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండి. యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. కుల్చారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. గత శనివారం రాంపూర్ వద్దు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.