Take a fresh look at your lifestyle.

జపాన్​ టూర్ సక్సెస్

  • రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు.
  • జపాన్​ టూర్​లో తెలంగాణ రైజింగ్​ టీం.
  • 30 వేల కొత్త ఉద్యోగాలు.
  • జపాన్​ నుంచి సీఎం టీం రిటర్న్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 15న జపాన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం టీమ్..మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులతో పాటు సుమారు 30,500 ఉద్యోగాలు సాధించింది.అలాగే మూసీ పునరుజ్జీవంతో పాటు ఆ దేశంలో అమలవుతోన్న సంస్కరణలను నిశితంగా పరిశీలించింది.పెట్టుబడుల విషయానికి వస్తే..హైదరాబాద్‌ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు మారుబెని కంపెనీ ముందుకువచ్చింది.ఇందులో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రైజింగ్ టీంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో ప్రాథమికంగా రూ. 5వేల కోట్ల పెట్టుబడుల అంచనాతో హైదరాబాద్ యువతకు 30వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది.హైదరాబాద్‌లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఎన్ టీ టీ డేటా, నెయిసా ఒప్పందం కుదుర్చుకున్నది.ఇందులో రూ.10,500 కోట్ల పెట్టుబడులకు ముందుకువచ్చింది.అలాగే తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా కంపెనీ రూ. 562 కోట్లతోరుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకువచ్చింది. టామ్​ కామ్తో టెర్న్, రాజ్ గ్రూప్ జపాన్‌లో 500 ఉద్యోగ నియామకాలకు ఒప్పందం కుదుర్చుకున్నది.ఇలా వారం రోజుల పాటు జపాన్ లో విస్తృతంగా పర్యటించిన ముఖ్యమంత్రి బృందం మంగళవారం టూర్ ను ముగించుకున్నది. నేడు సాయంత్రం తెలంగాణ రైజింగ్ టీం తెలంగాణలో అడుగుపెట్టనున్నది.

Leave A Reply

Your email address will not be published.