ముద్రప్రతినిధి: కాప్రా
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాలనీలను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు, మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారము ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల అభివృద్ధికి వెల్ఫేర్ అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. కాలనీ అభివృద్ధికి సహకరించిన సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.
కొత్త భవనం ద్వారా కాలనీ ప్రజలకు సమావేశాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మంచి వేదిక లభిస్తుందని సభ్యులు తెలిపారు.