Take a fresh look at your lifestyle.

రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ

ముద్ర ప్రతినిధి, మెదక్:
రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు.
తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం రాష్ట్రస్థాయిలో టిజిఐఆర్డి హైదరాబాద్ లో మూడు రోజులు జరగ్గా
దోపిడీ, అక్రమ రవాణా, కార్మిక దోపిడీలను నివారించడానికి, ప్రతిస్పందించడానికి బాలల రక్షణ వ్యవస్థలను మెరుగుపరచడం అనే ఎజెండా అంశంలో పదిమంది పాల్గొనగా 8 మంది విజేతలుగా మెదక్ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. ఆలాగే ప్రెస్ సభ్యుడిగా ఎంపికైన శంకరంపేట్ (ఆర్) కు చెందిన అబ్బాయికి స్పెషల్ మెన్షన్ అవార్డు లభించింది. యూనిసెస్ కమిటీలో భాగంగా స్పెషల్ డెలిగేటుగా పి.పూజ, హై కమెండేషన్స్ వన్ గా బి. అభిజ్ఞ, హై కమెండేషన్ టు గా ఎల్ వనిషిక, స్పెషల్ మెన్షన్ గా కె.అభిజ్ఞ, హానరబుల్ మెన్షన్ లో టీ. జయశ్రీ, ఆర్సియా ఫాతిమా, పి ఐశ్వర్య, ఏ.సమీక్ష విజేతలుగా నిలిచారు. జిల్లా స్థాయి నుండి ఎన్నికైన 11 మందిలో 9 మంది విజేతలుగా నిలవడం మెదక్ జిల్లాకు గర్వకారణం. ఇందుకు కారకులైన అందరికి జిల్లా విద్యాధికారి రాజు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్ గా టి.లింగమయ్య, జె.స్వరూపారాణి, సందీప్, కృష్ణ, రిసోర్స్ పర్సనల్గా రవిబాబు బూరుగుపల్లి, తిరనగరి నర్సింలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.