Take a fresh look at your lifestyle.

ప్రజల మన్ననలు పొందేలా  ఇంజనీర్లు పనిచేయాలి

  • ముఖ్యమంత్రిని ఒప్పించి ఏ శాఖలో లేని విధంగా ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఇప్పించాను.
  • వెంటనే అందుకు ఒప్పుకున్న సీఎంకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
  • ఇంజనీర్లు మనసు పెట్టి పని చేస్తూ..డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలి.
  • ప్రమోషన్ పొందిన ఇంజనీర్లకు సూచించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖను పటిష్ట పరిచేందుకు ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఆర్ అండ్ బి శాఖ బలోపేతం పై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి అందుకు అనుగుణంగా పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు.గతంలో పెద్ద ఎత్తున ఏ.ఈ, డి.ఈ, ఈ.ఈ, ఎస్.ఈ, సి.ఈ.ఇంజనీర్లకు ప్రమోషన్స్ పోస్టింగ్ ఇస్తూ శాఖ పరమైన నిర్ణయం తీసుకున్న మంత్రి, ప్రస్తుతం ఒక్క రోజే 64 మంది డిప్యూటీ ఇంజనీర్లు కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గా ప్రమోషన్ తో పాటు పోస్టింగ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి ఏ శాఖలో లేని విధంగా ప్రత్యేకంగా రోడ్లు భవనాలు శాఖ లో ప్రమోషన్స్, పోస్టింగ్స్ ఇప్పించాననీ తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి, తాను ఇంజనీర్లపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ స్థాయిలో ప్రజల మన్ననలు పొందేలా రోడ్లు భవనాలు శాఖ ఇంజనీర్లు పనిచేయాలనీ ఆదేశించారు.రాష్ట్ర ఇన్ఫ్రా డెవలప్ మెంట్ లో ఆర్ అండ్ బి కీలకంగా వ్యవహరిస్తున్నందున అధికారులపై గురుతర బాధ్యత ఉందన్నారు. అందువల్ల మనసు పెట్టి పని చేస్తూ.. డిపార్ట్‌మెంట్ కు మంచి పేరు తీసుకురావాలన్నారు. అదే విధంగా శాఖ బలోపేతం కోసం ఇంజనీర్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సూచించారు. ప్రజల్లో ఆర్ అండ్ బి శాఖకు మంచి పేరు తెచ్చేలా వ్యవహరించాలని కొత్తగా ప్రమోషన్, పోస్టింగ్ వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, ఆర్ అండ్ బి సర్వీస్ రూల్స్  అమెండ్మెంట్ చేసుకొని 6ఏళ్ల సర్వీస్ నిండిన 38మంది అసిస్టెంట్ ఇంజనీర్లను, ఎఇఇలుగా అప్ గ్రేడ్ చేసుకున్నామన్నారు.ఎఇఇ నుండి డిప్యూటి ఇంజనీర్లు గా 118 మంది కి(DPC) డిపార్ట్మెంట్ ప్రమోషన్ ప్యానెల్ అప్రూవ్మెంట్ ఇచ్చుకున్నామని తెలిపారు.అందులో ఇప్పటికే 102 మందికి ప్రమోషన్ తో పోస్టింగ్స్ కూడా ఇచ్చామన్నారు.అట్లాగే.. డిప్యూటీ ఇంజనీర్లు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గా 72 మంది ప్రమోట్ కాగా ఇవాళ 64 మందికి ప్రమోషన్,పోస్టింగ్స్ కల్పించామన్నారు.ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నుండి సూపరింటెండ్ ఇంజనీర్లు గా 29 మందికి, సూపరింటెండ్ నుండి చీఫ్ ఇంజనీర్లు గా నలుగురుని(4) ప్రమోషన్ వచ్చిందని అన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ముగ్గురు సి.ఈ లు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేశారని, ప్రస్తుతం మహిళా ఈఎన్సీ తిరుమల ఆర్ అండ్ బి శాఖకు హెచ్ఓడి స్థాయిలో సేవలు అందిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ ఇంజనీర్లకు అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.డిపార్ట్ మెంట్ లో ఖాళీలు కూడా వెంటనే భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఎప్పటికప్పుడు వివరాలు పంపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.