ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి అండర్-19 అండర్ 23 పోటీలకు గాను క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు.బుధవారం జడ్చర్ల మినీ స్టేడియంలో జడ్చర్ల జట్టు ఎంపికలను నిర్వహించారు.ఈ ఎంపికకు జడ్చర్ల, షాద్నగర్ మరియు కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారని కోచ్ మోయిన్ తెలిపారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న జడ్చర్ల మున్సిపాలిటీ చైర్ పర్సన్ పుష్పలత మాట్లాడుతూ, కష్టపడి ఎంపికైన క్రీడాకారులు రాబోయే ఉమ్మడి జిల్లా పోటీలలో సత్తా చాటి రాష్ట్రస్థాయిలో కూడా రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జడ్చర్ల కౌన్సిలర్లు, సతీష్, రమేష్, ఉమా శంకర్, అశోక్ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు రామ్మోహన్, కాంగ్రెస్ నాయకులు బాద్మి రవి శంకర్, నరసింహ, ఫ్లైవాక్ అసోసియేషన్ అధ్యక్షులు కాల్వ రాoరెడ్డి గ ఎండిసిఏ పరిశీలకులు మన్నాన్ నియర్ క్రీడాకారులుశ్రీ హరి, అన్సారీ, రవి, విజయ్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.