ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్య వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహించనున్న ఆరోగ్య వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవికుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ విభాగాల సమన్వయంతో వారం రోజులపాటు ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఏప్రిల్ 6: ఫుడ్ సేఫ్టీపై అవగాహన, ఆహార కల్తీ వల్ల వచ్చే వ్యాధులపై ప్రచారం. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుండి కార్యక్రమాలు ప్రారంభం. ఫుడ్ హాండ్లర్స్, కుక్స్‌కు శిక్షణ. స్ట్రీట్ వెండర్లకు గుర్తింపు పత్రాలు.
ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు.
ఏప్రిల్ 8: సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా గర్భిణీల చెకప్, హై రిస్క్ కేసులపై వర్క్‌షాప్.
ఏప్రిల్ 9: ఎయిడ్స్ అవగాహన కోసం రెడ్ రన్/వాక్, TB/HIV స్క్రీనింగ్, బాధిత పిల్లలకు పోషకాహార పంపిణీ.
ఏప్రిల్ 10: హోమియోపతి & ఆయుష్ డే సందర్భంగా యోగా ప్రదర్శనలు, మెడికల్ క్యాంపులు.
ఏప్రిల్ 11: డ్రగ్ వినియోగంపై అవగాహన, డ్రగ్ అబ్యూస్ నిరోధక కార్యక్రమాలు.
ఈ వారోత్సవాలకు సంబంధించిన బాధ్యతలను అన్ని విభాగాలు సమర్థంగా నిర్వహించాలని, కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.