Take a fresh look at your lifestyle.

ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు.

 

ముద్ర నడిగూడెం….

భారతదేశ తొలి ఉప ప్రధాని, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి వేడుకలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎమ్మార్వో సోమగాని సూరయ్య, మండల కేంద్ర సర్పంచ్ దున్న శ్రీనివాస్ హాజరై జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూసుదీర్ఘకాలం బడుగు బలహీన వర్గాల వారికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. జగ్జీవన్ రావు సేవలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండా వెంకన్న గుప్తా, బాణాల నాగరాజు, నాగారపు రాము, దున్న ప్రదీప్,చిలకల ఉ ఉపేందర్, బోనగిరి ఉపేందర్, షేక్ రియాజ్,దళిత బహుజన నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.