Take a fresh look at your lifestyle.

సార్వత్రిక సమ్మెకు ఐజేయూ మద్దతు

 

– ఫిబ్రవరి 12 సమ్మెకు సంఘీభావం
– నాలుగు లేబర్ కోడ్‌ల ఉపసంహరణ డిమాండ్
– 29 కార్మిక చట్టాల రద్దుపై ఆందోళన
– మీడియా సిబ్బంది హక్కులు బలహీనమయ్యాయని ఐజేయూ వ్యాఖ్య
– వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పునరుద్ధరణ కోరుతూ కేంద్రానికి ఐజేయూ విజ్ఞప్తి
– వేజ్ బోర్డు వ్యవస్థ రద్దును ఖండించిన జర్నలిస్టుల యూనియన్లు
– కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ట్రేడ్ యూనియన్లతో చర్చలు ప్రారంభించాలని ఐజేయూ డిమాండ్

హైదరాబాద్/చండీగఢ్, ఫిబ్రవరి: దేశంలో అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక కోడ్ లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పూర్తి మద్దతు ప్రకటించింది.
ఐజేయూ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్వీందర్ సింగ్ జమ్ము ఒక సంయుక్త ప్రకటనలో ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటిస్తూ వర్కింగ్ జర్నలిస్టుల చట్టంతో సహా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్ లను తేవడం ద్వారా వివిధ రంగాల కార్మికులకు, ముఖ్యంగా మీడియా సిబ్బందికి లభిస్తున్న చట్టపరమైన రక్షణలు బలహీనపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త కేంద్ర ప్రభుత్వం నాలుగు కొత్త తెచ్చిన లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కఠిన పోరాటాలతో సాధించుకున్న హక్కులను అవి దెబ్బతీస్తున్నాయని, సమిష్టి చర్చా హక్కును బలహీనపరుస్తున్నాయని, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రతా ప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ‘వర్కింగ్ జర్నలిస్ట్స్ అండ్ అదర్ న్యూస్‌పేపర్ ఎంప్లాయీస్ (కండిషన్స్ ఆఫ్ సర్వీస్) అండ్ మిస్ లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్’ ను, వేజ్ బోర్డు వ్యవస్థను కార్మిక చట్టాల ఏకీకరణ పేరుతో రద్దు చేయడాన్ని ఐజేయూ తీవ్రంగా ఖండించింది. ఈ చట్టాలు జర్నలిస్టులు, ఇతర మీడియా సిబ్బంది సర్వీస్ నిబంధనలు, వేతనాలు, వృత్తిపరమైన హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషించాయని యూనియన్ పేర్కొంది.
వర్కింగ్ జర్నలిస్టుల చట్టాన్ని తిరిగి అమలు చేయాలని, వేజ్ బోర్డు వ్యవస్థను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కె. శ్రీనివాస్ రెడ్డి మరియు బల్వీందర్ సింగ్ జమ్ము డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లతో అర్థవంతమైన చర్చలు ప్రారంభించాలని ఐజేయూ డిమాండ్ చేసింది.
తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యూజే ) అధ్యక్షుడు కె విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి కె రామ్ నారాయణ కూడా గురువారం నాటి సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.