Take a fresh look at your lifestyle.

బాబు జగజీవన్ రావు ఆశయ సాధనకు యువత పోరాడాలి

  • కార్పొరేటర్ సునీత యాదవ్.

మల్కాజిగిరి ముద్ర విలేఖరి: నేటి యువత బాబు జగ్జీవన్ రావ్ ఆశయ సాధనకు కృషి చేయాలని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రు నగర్ లో గల విగ్రహానికి ముఖ్యఅతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల రాము యాదవ్.బైరు అనిల్, సిద్దిరాములు, మరి యు బి ఆర్ ఎస్ నాయకులు, నాయకురాలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.