Take a fresh look at your lifestyle.

పదవి దాహంతో కాపు వర్గంలో స్వార్థపూరిత రాజకీయాలు

  • కాపు వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తే సహించే ప్రసక్తే లేదు.
  • పదవుల కోసమే కొత్త అసోసియేషన్లు.

కూకట్ పల్లి, ముద్ర విలేకరి: కూకట్ పల్లి కాపు సామాజిక వర్గంలో కొందరు పదవి దాహంతో స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని కూకట్ పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్షుడు మోటేపల్లి భరత్ కుమార్ విమర్శించారు. ఆదివారం కూకట్ పల్లి కాపు సామాజిక వర్గం, అసోసియేషన్ కార్యవర్గం, కాపు పెద్దలు సభ్యుల సమక్షంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ అధ్యక్షుడు మోటేపల్లి భరత్ కుమార్, కార్యనిర్వాహక సభ్యులు డేగల వెంకట నాగేశ్వరరావులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కూకట్ పల్లిలో జరుగుతున్న పరిణామాల విషయంలో వివరణ ఇవ్వడానికి సమావేశమై మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. కూకట్ పల్లి పరిధిలో కాపు సామాజిక వర్గం గత 40 సంవత్సరాలు నుండి ఐక్యతగా, నిష్పక్షపాతంగా కమిటీలను రూపొందించుకొని ఐక్యతతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం కొంత మంది పదవి ఆకాంక్షతో కమిటీలు ఏర్పాటు చేసుకొని, కూకట్ పల్లి కాపు సామాజిక వర్గం తీర్మానాలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాపు సామాజిక సభ్యులను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కాపు సంఘ పదవులకు రాజీనామా చేసి పార్టీ జెండాలు మోసి , తిరిగి కాపు సంఘ అధ్యక్ష పదవి ఆశించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పదవీకాంక్షతో కాపు సామాజిక వర్గాన్ని పదిమంది వ్యక్తులు అనైక్యతకు చేయడం సిగ్గుచేటున్నాను. వాళ్ల కుట్రపూరిత ప్రయత్నాలను కూకట్ పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్, కాపు సామాజిక వర్గం చూస్తూ ఉపేక్షించదని అధ్యక్ష కార్యదర్శులు హెచ్చరించారు. ఇప్పటివరకు నూతనంగా కాపు సామాజిక వర్గం పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలను కానీ, ఇకపై వచ్చే నూతన కమిటీలను పరిగణంలోకి తీసుకొనబడవని సభ్యులు హెచ్చరించారు. కూకట్ పల్లి కాపు పేరు తో మరో అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వకూడదని కాపు సంఘం సమిష్టిగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కూకట్ పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఎన్నికలను కలిగినిడి ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి కాపు సభ్యులందరూ కట్టుబడి ఉండాలని తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.