Take a fresh look at your lifestyle.

ప్రతి సమస్యను పరిష్కరిస్తాము-మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర,మోత్కూరు:
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగముగా మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 1వ, 2వ వార్డు కి సంబంధించి పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రతిజ్ఞ చేస్తున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్, వార్డు కౌన్సిలర్ కురిమిల్ల ప్రమీల, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది ,పట్టణ ప్రజలు ప్రతిజ్ఞ అనంతరం వార్డులో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య మాట్లాడుతూ వార్డులో పారిశుద్ధ్యముకు సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే 99 రోజుల ప్రణాళికలో పూర్తి చేసే విధముగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు శ్రీకాంత్, వెంకన్న మేనేజర్ ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.