Take a fresh look at your lifestyle.

​సీఎంసీ భవన నిర్మాణానికి స్థలాలు కేటాయించండి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే మాధవరం వినతి

 

ముద్ర కూకట్‌పల్లి :

నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయ భవన సముదాయాల నిర్మాణానికి కూకట్‌పల్లి పరిధిలోని ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.

సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లకు కూకట్‌పల్లి కేంద్ర బిందువుగా ఉంటుంది.

కూకట్‌పల్లి జోన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలాలు లేదా హుడా (హుడా) ట్రక్ పార్క్ స్థలాలు భవన నిర్మాణానికి అత్యంత అనుకూలమని పేర్కొన్నారు.

​ఇక్కడ రోడ్డు, మెట్రో మరియు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రజలు 10 నుండి 30 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోవచ్చని వివరించారు.

​ప్రజలకు, ఉద్యోగులకు అన్ని విధాలా అందుబాటులో ఉండే కూకట్‌పల్లిలోనే సీఎంసీ భవనాలను నిర్మించాలని ఆయన సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజను కోరారు.

Leave A Reply

Your email address will not be published.