Take a fresh look at your lifestyle.

ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి పొడగింపుపై హర్షం

 

ముద్ర, నారాయణ పేట:

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయు) నారాయణపేట జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోయిలకొండ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి శివ శంకర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు నక్క శ్రీనివాస్, రాష్ట్ర డిజిటల్ మీడియా కార్యవర్గ సభ్యులు గణప రఘు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగడం రాష్ట్రంలోని జర్నలిస్టులకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో చైర్మన్‌కు పూర్తి స్థాయి అవగాహన ఉందని తెలిపారు. నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఆయన కృషి చేస్తారని తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వృత్తి నిబద్ధతతో పనిచేస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, సంక్షేమ పథకాలు, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు ఆయన కృషి కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీడియా రంగ అభివృద్ధికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.