- భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు.
కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణ కేంద్రంలో అల్లమీయా గుట్ట ఈద్గా వద్ద ఈద్ ఉల్–అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.మత పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ అనేది త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందనీ శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటమని తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరీ సోదరీమణులందరూ బక్రీద్ పండుగ సంతోషంగా జరుపుకోవాలని పేదల పట్ల జాలీ, దయ, కరుణ కలిగి ఉండడమే బక్రీద్ పండుగ పర్వదినం ఇచ్చే సందేశం అని ప్రజలందరికీ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర దేవాలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిటిమెళ్ళి రంజిత్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
