మాదాపూర్, ముద్ర విలేఖరి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చెన్నై నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి శ్రీమతి రాజేశ్వరి తన ప్రదర్శనలో స్వరజతి, జావళి, అర్ధనారీశ్వరం అంశాలను ప్రదర్శించి మెప్పించారు. శ్రీముఖి నృత్యాలయా నాట్యగురువు కుమారి మనస్విని కోసూరు గారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో రంగ పూజ, గజవదాన బెడువే, జయము జయము, ముద్దుగారే యశోద, గరుడ గమన, నారాయణతే నమో నమో, కృష్ణం కలయసఖి, కృష్ణ శబ్దం అంశాలను శ్రీ మనస్విని, అంజనా, రుక్మిణి, హిమశ్రీ, శ్రీలేఖ, భువన, సహస్ర, హరిణి, దివ్య శ్రీ, ఆరాధ్య, శ్రీనిక, రుత్విక, అన్విక, విజయ శ్రీ, పూర్వీక, మాన్విత, హరి హర మొదలైన కళాకారులూ ప్రదర్శించి మెప్పించారు.

