చందానగర్, ముద్ర విలేఖరి: క్యాన్సర్ వ్యాధిని ప్రాధమిక దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని పీయేసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు.చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ పీజేఆర్ ఎనక్లేవ్ రోడ్డు లో ప్రైవేట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ క్యాన్సర్ స్క్రినింగ్ మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పీయేసీ ఛైర్మెన్ ఆరెకపూడి.
ఈ సందర్భంగా చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రినింగ్ పరీక్ష మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినదించదగ్గ విషయం అని, కాలనీ వాసులకు, చుట్టుపక్కల పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించడం చాలా శుభపరిణామం అని చైర్మన్ గాంధీ అన్నారు.క్యాన్సర్ మహమ్మారి మొదటి దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రినింగ్ పరీక్ష వలన ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, దీప్తి శ్రీ నగర్, పీజే ఆర్ ఎనక్లేవ్ పరిసర ప్రాంతాల్లో మధ్యతరగతి ,పేద ప్రజలు నివసిస్తున్నారు.అని ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడి ప్రాంత ప్రజలకు దోహదపడుతుంది అని తెలియచేసారు.ఉచితంగా గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు, జనరల్, దంత వైద్యం, బీపీ, షుగర్, గైనకలజీ,ఆర్థో, మొదలగు సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగినది అని ,పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం చాలా అభినందనియమని ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయం అని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని PAC చైర్మన్ గాంధీ గారు కొనియాడారు. ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినదించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ కిరణ్ ,శిరీష మరియువైద్య సిబ్బంది కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
