- ఆదర్శ పాఠశాలలో తాగునీటి కట కట
- విద్యార్థులకు తప్పని తాగునీటి తిప్పలు
- కలెక్టర్ ఆదేశాలతో కలిగిన మున్సిపల్ యంత్రాంగం
ముద్ర, ఇబ్రహీంపట్నం: ఆదర్శ పాఠశాలలో నీటి కొరత విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గుర్తుచేస్తోంది. పాఠశాలలో త్రాగునీరు రాక బయట వాటర్ ప్లాంట్ నుండి వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తూ విద్యార్థులు దాహార్తి తీర్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూరు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో గత కొన్ని రోజులుగా త్రాగు నీరు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు రాకపోవడంతో కొంత మొత్తంలో డబ్బు పోగుచేసుకొని బయట ఉన్న ప్రైవేటు వాటర్ ప్లాంట్ నుండి నీటి క్యాన్లు కొనుగోలు చేస్తూ తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. సీఎం రేవంత్ సారూ మాకు త్రాగు నీరు ఇవ్వండి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు.గత కొన్ని రోజులుగా త్రాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, త్రాగు నీటి కోసం క్లాస్ రూమ్ లో తాము డబ్బులు పోగు చేసుకొని వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు.కనీస అవసరాలకు సైతం నీరు చాలడం లేదని దీంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సరఫరా చేయించి ఇబ్బందులు తొలగించాలని వేడుకుంటున్నారు.
కలెక్టర్ ఆదేశాలతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం
నీటి క్యాన్లు కొనుగోలు చేస్తూ దాహార్తిని తీర్చుకుంటున్న ఆదర్శ పాఠశాల విద్యార్థుల సమస్య జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి దృష్టికి వెళ్లడంతో కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో చలనం వచ్చింది.మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ సంబంధిత అధికారులతో కలిసి ఆదర్శ పాఠశాలను సందర్శించారు.పాఠశాల ఆవరణలో కలిగి విద్యార్థులను అడిగి సమస్యను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.