Take a fresh look at your lifestyle.

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు.
మంగళవారం మినీ మీటింగ్ హాలులో ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి , వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా విద్యా,తదితర సంబంధిత విభాగాలతో కలిసి డ్రగ్స్ నిర్మూలన పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు వారికి ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. ఎవ్వరైనా మాదకద్రవ్యాల రవాణా వినియోగం చేస్తే NDPS చట్టం ప్రకారం శిక్షా అర్హులు అవుతారని తెలిపారు.కాలేజీ, ఫ్యాక్టరీ లలో ప్రత్యేక నిఘా పెట్టి నిత్యం గమనిస్తూ ఉండాలని, సూచించారు. కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.మున్సిపల్ పరిధి, గ్రామపంచాతీ పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం పై జరిగే దుష్ పరిణామాలపై ప్రజల ప్రచారం చేయాలన్నారు . చదువు మధ్యలో మానేసిన విద్యార్థులపై నిగా పెట్టాలన్నారు. జిల్లాలో గంజాయి రవాణా సరఫరా చేసిన వారిని గుర్తించి పోలీస్ శాఖ ద్వారా 7 కేసులు, ఎక్సైజ్ శాఖ ద్వారా 3 గంజాయి కేసు మొత్తం (8) కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.అన్ని విభాగాల సమన్వయంతో జిల్లాలో డ్రగ్స్, గుడుంబా, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేయాలని ఆయన సూచించారు.
జిల్లా ఎస్పీ ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ కాలేజీ ,ఫ్యాక్టరీ, గ్రామాలలో డ్రగ్స్ పై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. యువత డ్రగ్స్ కి అలవాటు పడకుండా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.