Take a fresh look at your lifestyle.

సైబర్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

  • మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైన సిఐఆర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.
  • జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్. 
  • జిల్లాలో పోగొట్టుకున్న, చోరికి గురైన 20 లక్షల విలువగల 102   మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ. 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  సెల్ ఫోన్  పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని www.ceir.gov.in CEIR  సిఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరి గురైన  102 రూ. 20   లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు ఎస్పీ అప్పగించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల  అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సిఐఆర్ వెబ్ సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.సిఐఆర్ లో  వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్  ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని అన్నారు.ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాలని సూచించారు.సైబర్ మోసాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ ఫోన్ కాల్స్ కు స్పందించ కూడదని, మంచిదని, ఇంటర్నేషనల్ కాల్స్, కొత్త నంబర్ల నుంచి ఫోన్ వస్తే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.అజ్ఞాత వ్యక్తుల కు  ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని, డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దని సూచించారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయాలని కోరారు.లేదంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ ఆర్ ఎస్ ఐ కృష్ణ ,హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ లు అజర్ యాకూబ్, మల్లేశంలను ఎస్పీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.