Take a fresh look at your lifestyle.

తట్టెపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

. ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, కూతురు మృతి
. గాయాలతో చికిత్స పొందుతున్న కుమారుడు

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ సమీపంలో లారీ స్కూటి ఢీకొనిఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య, భర్త, కూతురు ముగ్గురు స్పాట్లో మృతిచెందగా కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు మరియు పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన కుటుంబీకులు సోమవారం ఉదయం రుక్మాపూర్ నుంచి కవి రాజు తన భార్య కుమారుడు, కూతురుతో కలిసి స్కూటీపై జహీరాబాద్ కు బయలుదేరారు. మార్గమధ్యంలో తట్టేపల్లి వద్ద జహీరాబాద్ నుండి ఎదురుగా వస్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో స్పాట్ లోనే భార్య పావని (29) భర్త కవి రాజు (40) కూతురు కీర్తన(11) మృతి చెందారు. కుమారుడు కార్తీక్ మాత్రం గాయాలతో తల్లి శవం వద్ద రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.ఘటన స్థలానికి పెద్దముల్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వర్ధన్ చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయాలతో ఉన్న బాలుడిని సైతం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.