Take a fresh look at your lifestyle.

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తోన్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికులతో ఆందోళన చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

 

🔸మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనబడటం లేదు.

🔸కుత్భుల్లాపూర్ లో పేదల ఇళ్లను కూల్చేశారు.

🔸ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారు.

🔸మూసీలో కూడా పేదవాళ్ల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారు.

🔸 మూసీ లో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి, ప్రభుత్వానికి కనబడటం లేదు.

🔸రంగనాథ్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పారు ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు కూడా మేమంతా ఇక్కడే ఉంటాం.

🔸జనం బాటలో భాగంగా చెరువులు, నదులు అక్రమించి కట్టిన బిల్డింగ్ ల గురించి మనం కంప్లైంట్స్ ఇచ్చాం ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు.

🔸 ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు కూల్చేశారు.. త్వరలోనే అక్కడకు వెళ్తాం.

🔸గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు.

🔸ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారు.

🔸దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన ఆ అపార్ట్ మెంట్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు.

🔸ఇక్కడ ఇప్పుడిప్పుడే కడుతున్న, ఎవరికీ నష్టం లేని బిల్డింగ్ ను మాత్రం ఆపటం లేదు.

🔸మాకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదు. ప్రభుత్వంతోనే మా పంచాయితీ.

🔸బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు.

🔸కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలను ఆపారు.

🔸 ఆ తర్వాత ఆమ్యమ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారు.

🔸న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటం.

🔸కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటాం.

Leave A Reply

Your email address will not be published.