Take a fresh look at your lifestyle.

మల్కాజిగిరిలో ఘనంగా సేవాలాల్ జయంతి

 

ముద్ర : మల్కాజిగిరి

లంబాడీల హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ జయంతి వేడుకలు ఆదివారం రామాంజనేయ నగర్ లో ఘనంగా జరిగాయి. రాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ పాల్గొని సేవాలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేవలను గుర్తు చేసుకున్నారు అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లంబాడి కుటుంబ సభ్యులతో పాటు బిఆర్ఎస్ నాయకులు,బైరు అనిల్,నగేష్ గౌడ్,వాసు,శెంకర్,లక్ష్మణ్ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.