Take a fresh look at your lifestyle.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలి : శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ఛైర్మెన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ఛైర్మెన్, కరస్పాండెంట్ పడాల శ్రీనివాస్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా మొదటి, స్టేట్ ర్యాంకులతో శ్రీవైష్ణవి జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించగా సోమవారం కళాశాల ప్రాంగణంలో ఎర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.


కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ మధర మల్లేషం మాట్లాడుతూ పట్టణంలో ప్రత్యేక ప్రణాళికతో తరగతులు నిర్వహిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని, ఈ విద్యాసంవత్సరం పూర్తి హంగులతో కూడిన హాస్టల్ వసతిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.