Take a fresh look at your lifestyle.

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ త్రీ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రమేష్ హాజరై అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన బాల్యం నుంచి ఎదుర్కొన్న కష్టాలను మానవజాతి కి జరుగుతున్న అన్యాయాలను అసమానతలు తొలగించి సమసమాజ స్థాపన చేయాలని ఆయన పడ్డ కష్టాలను రాజ్యాంగాన్ని రచించడంలో ఆయన చూపిన ప్రతిభ పాటవాలను భారతజాతి మొత్తం గుర్తుంచుకోవాలని ప్రతి ఏటా ఘనంగా ఇటువంటి సంస్మరణ సభలు నిర్వహించాలని జయంతులను వర్ధంతి ఘనంగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగాలు అధిపతులు కే. బాలరాజు, టీ,రామకృష్ణ, అత్తరు ఫరీన్లు, డాక్టర్ బి జగనాథ్, డాక్టర్ సత్యనారాయణ, సుధా, రవీందర్, లెక్చరర్లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.