- రైతులను వరి కొనుగోలు కేంద్రాల్లో మోసం చేస్తున్న మహిళ సమైక్య అధికారులు.
- సిపిఎం మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్.
అచ్చంపేట ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం లో వరి కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు కూడా లేవని వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బలమూరు మండల కేంద్రంలో వడ్లు కొనుగోలు కేంద్రం పరిశీలించి రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు వరి తీసుకొచ్చి 15 రోజులు గడుస్తున్న కాంటా వేసే పరిస్థితి లేదని ఇచ్చిన వడ్లను వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళా సమైక్య ద్వారా కొనుగోలు చేస్తున్న సకాలంలో బస్తాలను ఇవ్వడంలేదని సంచి బరువు పేరుతో ఒక బస్తాకు ఒక కిలో 300 గ్రాములు తరుగు తీస్తున్నారని కొద్దిగా పచ్చిగా ఉన్న నాలుగు ఐదు కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొనుగోలు చేస్తున్న సమైక్య లీడర్లను అడిగితే మా అధికారులు చెప్పారు వారు చెప్పినట్టుగానే బస్తాకు 1300 గ్రాములు తరుగు తీస్తున్నామని చెప్పడం వాటికి ఏమైనా వ్రాతపూర్వకంగా అధికారులు లెటర్లు సర్కులర్ ఇచ్చారని అడిగితే అట్లాంటిది ఏమీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎండాకాలం ఈదురుగాలులు అకాల వర్షాలు వడగళ్ల వాన కురుస్తున్న నేపథ్యంలో వరి కొనుగోలు కేంద్రాల్లో 15 రోజుల వరకు కాంట్రావెయ్యకపోతే తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని అట్లాంటి దాన్యం ఉంటే పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతులకు ధాన్యం నింపడానికి సంచులు ఇచ్చిన వాటిని తీసుకెళ్ళేందుకు మూడు నాలుగు రోజుల సమయం పడుతుందని అంతవరకు వర్షం వచ్చిన ఏం జరిగినా రైతులే బాధ్యత వహించాలని చెబుతున్నారని శంకర్ నాయక్ అన్నారు రైతులకు వెంటనే దాన్ని తడవకుండా కప్పేందుకు కవర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎండి లాల్ మహ్మద్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
