Take a fresh look at your lifestyle.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో..ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నారాయణరెడ్డి
ముద్ర ప్రతినిధి – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): కొంగర కలాన్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్
కార్యాలయాల సముదాయంలో సోమవారం 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకు ముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి ప్రసంగించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె,చంద్రారెడ్డి, శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, శంషాబాద్ డి.సి.పి బి.రాజేశ్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల శకటాల ప్రదర్శన
గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, హౌసింగ్, అగ్నిమాపక, సివిల్ సప్లయ్,   శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన నిర్వహించడం జరిగినది. అనంతరం గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, హౌసింగ్, అగ్నిమాపక, సివిల్ సప్లయ్, మత్స శాఖ, అన్ని సంక్షేమ శాఖలకు సంబంధించిన స్టాల్స్ సందర్శించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
  గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 1) డిపిఎస్ నాదర్గుల్ (చెక్ దే ఇండియా దేశభక్తినిత్యం)
2) ఎం జె పి పాలమాకుల (గళ్ళు గళ్ళు గళ్ళు జోడెడ్ల బండి జానపద నృత్యం) 3) భాష్యం మహేశ్వరం (జై జవాన్ జై కిసాన్, ఆర్మీ) 4) కేజీబీవీ ఆమనగల్ (బోనాల నృత్యం), 5) జడ్.పి.హెచ్.ఎస్ సాహెబ్ నగర్ (ఆపరేషన్ సింధూరపై నృత్యం) 6) జడ్పీహెచ్ఎస్ తుక్కుగూడ (బంజారా నృత్యం) చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎద నిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు.
మహిళా సంఘాలకు రుణాల అందజేత
దివ్యాంగులకు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, చెవి మిషన్లు, చేనేతే రుణమఫి పథకం కింద 82,51,257/- రూపాయల చెక్కును, జ్యోతి జిల్లా మహిళా సమాఖ్యకు 797,21,00,000/- రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ అందజేశారు.
**

Leave A Reply

Your email address will not be published.