Take a fresh look at your lifestyle.

ప్రారంభమైన రెండో విడత అలైవ్ అరైవ్ -ఎస్పీ జానకి షర్మిల

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయంగా రెండో విడత అలైవ్ అరైవ్ కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ డీజీపీ శివధర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వారం రోజుల పాటు అన్ని పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన, సురక్షిత ప్రయాణం పై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. 23న లేన్ డిసిప్లిన్ డ్రైవ్ లో తప్పుడు ఓవర్‌టేకింగ్ తనిఖీ, ఎడమ లేన్ డ్రైవింగ్ అమలు చేయడం, 24న హెల్మెట్ హెల్మెట్ తనిఖీ డ్రైవ్‌లు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 25 న జిల్లా లోని ప్రధాన కూడళ్లలో నాలుగు చక్రాల వాహనాల తనిఖీలు జరిపి సీట్ బెల్ట్ వినియోగంపై వివరించనున్నామన్నారు. 26న డ్రంకెన్ డ్రైవ్ పై, 27న భారీ వాహన డ్రైవర్లకు శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు, కళ్లజోళ్లు పంపిణీ చేస్తామన్నారు. 28న కార్యక్రమం ముగుస్తుందని ఎస్పీ వివరించారు.

Leave A Reply

Your email address will not be published.