Take a fresh look at your lifestyle.

సిఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు

 

మహదేవపూర్, ముద్ర:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం పుష్కర పనుల సమీక్ష అనంతరం కాటారం మండలం నస్తూరుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఈవరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పోలీస్ సిరి శెట్టి సంకీర్త్ లు సి ఎం పర్యటన పనులను పర్యవేక్షించారు. కార్యక్రమాలకు పటిష్టమైన బందోబస్తు నిర్వహించడంతోపాటు కేటాయించిన విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని వీరు కోరారు. నస్తూరుపల్లి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభాస్థలి వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని డీపీవోను కోరారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. చేపట్టనున్న పనులను పర్యవేక్షణ చేయాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. హెలి ప్యాడ్, అప్రోచ్ రోడ్డు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అలాగే పబ్లిక్ మీటింగ్ వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లో లైటింగ్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో పాటు అంబులెన్సులు, సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాళేశ్వర దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయాలని ఈఓను ఆదేశించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 19, 20 తేదీలలో ఇసుక లారీలకు అనుమతించకూడదన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవోను ఆదేశించారు. సమీక్షకు ముందు కాళేశ్వరం, నస్తూరుపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లు స్వయంగా పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ, కాటారం డిఎస్పి సూర్యనారాయణ అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.