Take a fresh look at your lifestyle.

ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు బీజేపీ ధ్వజం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంజూరైన పాత టెండర్లను రద్దు చేసి బీజేపీ కౌన్సిలర్లున్న వార్డులను నిర్లక్షం చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ కౌన్సిలర్ లు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్, డీఈ, మున్సిపల్ చైర్ పర్సన్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోయినా వైస్ చైర్మన్ సమావేశాన్ని నిర్వహించి టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. మైనార్టీ వార్డుల్లో అధిక నిధులు పెంచి, బీజేపీ కౌన్సిలర్ వార్డులో నిధులు తగ్గించడం సరికాదని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విన్నపం మేరకు నిర్మల్ మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, కౌన్సిలర్లు సాదం స్వప్న అరవింద్, గంజి విజయ్ కుమార్ (రాజు), శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, హేమలత ముత్యం, ధర్మాజీ గారి రమ్య ఈశ్వర్, విఠల్, అయిండ్ల విజయలక్ష్మి , జింక సురేందర్, ఖమ్మం సురేందర్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.