Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14న ఉదయం 8 గంటలకు హైదరాబాద్ చౌరస్తా నుండి ప్రారంభమయ్యే భీమ్ యాత్రకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ప్రజాస్వామ్యక వాదులు, ప్రజాసంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ రిస్టులు అందరూ వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు కర్తల శ్రీనివాస్, ఎండీ. సజావుద్దీన్, కుతడి సురేష్, ఇటుకల దేవేందర్, నాగరం శంకర్,బొట్ల రమేష్, కాశపక మహేష్ ,చింతల శివ ,గాయపక శ్రవణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.