Take a fresh look at your lifestyle.

జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమం ప్రారంభం

  • సంవిధానం రక్షణకు కార్యకర్తలతో ప్రతిజ్ఞ.
  • 312 మందికి రూ.3కోట్ల 10 లక్షల 2 వేలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జిల్లా కాంగ్రేస్ ఆద్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిదాన్ జగిత్యాల జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు.భారత రాజ్యంగాన్నీ రక్షించాలని, అంబేద్కర్ కల్పించిన హక్కుల ను కాపాడాలని జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమాన్నికాంగ్రెస్ చేపట్టింది.జిల్లా పరిశీలకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, టీ పీసీసీ ప్రతినిధి అవేజ్, రుద్ర సంతోష్ హాజరయ్యారు.సంవిధాన రక్షణ కోసం, హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పించాలని, కార్యకర్తలు, నాయకులతో ప్రతిజ్ఞ చేయించి, జై బాపు జై భీమ్ జై సంవిదాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్ళాలని సూచించారు.భారత సంవిధాన రక్షణ కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ప్రజల హక్కులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాలుగా ప్రజల గొంతుక గా నిలిచానని, పార్టీ నీ బలోపేతం చేయడంలో కృషి చేశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత సంవిధాన రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కత్తి వెంకట స్వామి మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ కి అవసరమని, అధిష్టానం దృష్టికి సైతం తీసుకెల్లామని అన్నారు. అనంతరం జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 312 మందికి రూ.3కోట్ల 10 లక్షల 2 వేలు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.