ముద్ర,జగిత్యాల టౌన్: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని జూన్ 1 నుంచి 30 నెల రోజుల వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అములులో ఉంటుందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని, పోలీసులకు సహకరించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు.