వరస చోరీలను ఛేదించిన పోలీసులు
ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఆ దొంగకు శనివారం వస్తే పండగే. అదే సమయంలో పోలీసులకు అదో సవాల్. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో శనివారం రోజుల్లో వరస దొంగతనాలతో హడలెత్తించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. భైంసా పరిసరాల్లోని నరసింహస్వామి, హనుమాన్, సంతోషిమాత, బాలాజీ దేవాలయాల్లో హిమ వైన్స్ షాపు దొంగతనం కేసులతో ప్రమేయం ఉన్న నిందితుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ జానకి షర్మిల విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిందితుడు విజయ్ షిండే @ అశోక్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దొంగతనంలో సుమారు 3.150 కిలో గ్రాముల వెండి సొత్తు, మరియు మూడు మాసాల బంగారాన్ని స్వాధీన పరుచుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఎస్సీ జానకి షర్మిల మాట్లాడుతూ నిందితుడు అశోక్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు. ఐతే గత కొంత కాలంగా మహారాష్ట్ర నాందేడ్ జిల్లా బలరాం పూర్ లో భార్యతో కలిసి నివసిస్తున్నాడన్నారు. వరుస దొంగ తనాలతో హడలెత్తించిన నిందితుని భార్యతో పాటు, వ్యాపారిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన భైంసా సబ్ డివిజన్ ఏ ఎస్పీ అవినాష్ కుమార్, భైంసా టౌన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్. ఎస్ఐ. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఆనంద్, పీపీలు ప్రమోద్, హరిబాబు, అంబదాస్, సుభాష్, శివరాజ్, శరత్ చంద్ర, మహిళా కానిస్టేబుళ్లు అనిత, సంగీత,హోమ్ గార్డ్ గంగారావ్ లను జిల్లా ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల అభినందించారు.