గొల్లపల్లి, ముద్ర:- జగిత్యాల జిల్లాలో గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందారు.జగిత్యాల జిల్లా డి సి ఆర్ బి లో ఎస్సెగా విధులు నిర్వర్తిస్తున్న కొక్కుల శ్వేత ధర్మారం వైపు నుండి జగిత్యాల వస్తుండగా గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు,గోవిందుపల్లి మధ్యన ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎస్ ఐ శ్వేత తో పాటు ద్విచక్ర వాహనం పైన ఉన్న మరో వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు,స్థానిక వ్యక్తులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహలను జగిత్యాల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.