Take a fresh look at your lifestyle.

ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : నైటింగేల్ ఫ్లోరెన్స్ జన్మదిన సందర్భంగా జరుపుకునే అంతర్జాతీయ నర్సులు దినోత్సవాన్ని సోమవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ప్రపంచ వైద్య వ్యవస్థలోనే అత్యంత ప్రావీణ్యత కనబరిచే నర్సింగ్ ఆఫీసర్స్ ఈ కాలంలో ఇంత మొత్తంలో ఉన్నారు అంటే కేవలం నైటింగేల్ ఫ్లోరెన్స్ కృషి అని పలువురు వైద్యులు గుర్తు చేశారు. పగలు రాత్రి అని చూసుకోకుండా నిరంతరం ప్రతి వైద్య వ్యవస్థలో గర్భిణీలకు కాన్పులు చేయడం, వైద్యులు సూచించిన ట్రీట్మెంట్ సకాలంలో ఇవ్వడం, ఆపరేషన్ అయిన వారికి మరియు గాయపడిన వారికి ఇన్ఫెక్షన్ కాకుండా డ్రెస్సింగ్ సకాలంలో చేయించడం లాంటి పనులు చేస్తూ ఆసుపత్రిలో కీలకమైన పాత్ర పోషించేది నర్సులే అని అన్నారు.కార్యక్రమంలో డాక్టర్ యశోద, డాక్టర్ విష్ణు, డాక్టర్ పాండురంగ, డాక్టర్ స్వప్న . నర్సింగ్ సూపర్డెంట్ పద్మ , శిరోమణి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ బాలమణి,జాయ్ మెర్సీ, సునీత , నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.