Take a fresh look at your lifestyle.

మంత్రి గారిని మర్యాద పూర్వ కాగా కలిసిన నూతన కార్యదర్శి..

 

హైదరాబాద్:

తెలంగాణ సోషల్ వెల్పెర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కార్యదర్శిగా,
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ (SCDD) కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి విజయేంద్ర బోయి గారు బుధవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శాఖ పరిధిలో అమలవుతున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. గురుకుల విద్యాసంస్థల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యాల మెరుగుదల, పరిపాలన బలోపేతంపై మంత్రి గారు సూచనలు చేశారు.

సాంఘిక సంక్షేమ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని విజయేంద్ర బోయి గారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.