Take a fresh look at your lifestyle.

పని గంటలు పెంచే, కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి..

కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి : మేడే వారోత్సవాల ముగింపు బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లిఖార్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం ప్రిన్స్ చౌరస్తా లో మేడే వారోత్సవాల ముగింపు సభ సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన జరగగా ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ కార్మికులను నయా బానిసలుగా మార్చే పద్దతుల్లో బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. యాజమాన్యాలు, పెట్టాబడిదార్లకు యదేచ్చగా శ్రమ దోపిడీ చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. రోజుకు 8 గంటల నుండి 12 గంటలు పెంచడంతో పాటు సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కునే హక్కును కాలరాస్తుందన్నారు.
ఏ చట్టాలు లేనప్పుడే బ్రిటీష్ వారి కాలంలోనే తిరుగుబాటు ఉద్యమాలు చేశారని, స్వాతంత్ర్య ఉద్యమంలో ముందుపీటిన ఉన్నారని గుర్తు చేశారు. ఇటీవల ఢిల్లీ నగరం నోయిడా ప్రాంతంలో వేలాదిమంది కార్మికులు చేసిన సమ్మె లేబర్ కోడ్స్ కు చెంపపెట్టు అని అన్నారు. చికాగో నగరంలో 140 సంవత్సరాల క్రితం పనిగంటల తగ్గింపుకు వ్యతిరేకంగా చేసిన పోరాటం స్ఫూర్తితో కార్మికవర్గం సమరశీల ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్లు దాసరి పాండు, ఎండి పాషా, మాయ కృష్ణ,పైళ్ళ గణపతిరెడ్డి, గొరిగే సోములు, చిలువేరు రామాకుమారి, సుబ్బూరు సత్యనారాయణ, చెక్క రమేశ్, పొట్ట యాదమ్మ, నకిరేకంటి రాము జిల్లా నాయకులు పోతరాజు జహంగీర్, మంచాల మధు, బుర్రు అనిల్, పుష్ప,లలిత, సి హెచ్ శ్రీనివాస్, మెంటే ఎల్లయ్య, దేవయ్య, జంగయ్య, రామసాని వసంత, కళ్యాణి, సంగి రాజు తదితరులు పాల్గొనగా గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ కార్మిక సంఘం, ట్రాన్స్ పోర్ట్, ఆర్ పి యూనియన్, మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ యూనియన్, హమాలీ యూనియన్ ల నుండి మండుటెండలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.