వరుసగా నాలుగో సంవత్సరంలో భారతదేశపు నంబర్ 1 ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజంగా నిల్చిన మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్
ముంబై: భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (ఎంఎల్ఎంఎంఎల్) 2026 ఆర్థిక సంవత్సరంలో కూడా మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగింది. వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలోనూ భారతదేశపు నంబర్ 1 ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల తయారీ సంస్థగా నిల్చింది. తమ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ప్రస్థానం కోసం ఎంఎల్ఎంఎంఎల్‌ని ఎంచుకున్న అసంఖ్యాక డ్రైవర్లు మరియు ఫ్లీట్ ఓనర్లకు సంస్థపై గల నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనంగా నిలుస్తుంది. ఎంఎల్ఎంఎంఎల్ ఇప్పటివరకు మొత్తం మీద 3.4 లక్షల ఈవీలను విక్రయించింది.
ఎల్5 కేటగిరీలో 39.7 శాతం మార్కెట్ వాటాతో ఎంఎల్ఎంఎంఎల్ పటిష్టమైన స్థానంలో ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పలు కీలక మైలురాళ్లను సాధించింది. అవేమిటంటే:
2026లో 1 లక్ష ఈవీల అమ్మకాలను అధిగమించడం ద్వారా ఈ మైలురాయిని సాధించిన తొలి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థగా నిల్చింది.
భారతదేశపు సస్టైనబిలిటీ లక్ష్యాలకు తోడ్పాటునిస్తూ మొత్తం మీద 6 బిలియన్ల పైగా ఈ-కిలోమీటర్ల ప్రయాణాలను పూర్తి చేయడం ద్వారా సుమారు 240 కిలో ఎంటీ (MT) మేర కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తోడ్పడింది.
2026 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త మహీంద్రా ఉడో (UDO)ని ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ తమ ప్రోడక్టుల పోర్ట్‌ఫోలియోని మరింతగా విస్తరించింది. కస్టమర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని ఉడో రూపొందించబడింది. ఇందులో సెగ్మెంట్లోనే తొలిసారిగా రివర్స్ థ్రోటిల్, ఏరోడైనమిక్ డిజైన్, వాస్తవ ప్రపంచంలో 200 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజిలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆవిష్కరణలు, విశ్వసనీయత, సస్టైనబిలిటీపై దృష్టి పెట్టడాన్ని కొనసాగించడమనేది భారతదేశపు లాస్ట్ మైల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పరివర్తన విషయంలో ఎంఎల్ఎంఎంఎల్ ముందుండేందుకు తోడ్పడనుంది.