- 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లలో పనిచేస్తున్న కార్మికులకు వి డి ఏ వేతన సవరణ చేయాలి.
- వేతన సవరణ చేయక 12 వేల కోట్లు నష్టపోతున్న కార్మికులు.
- ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని బిక్షపతి.
ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: కోటి 28 లక్షల అసంఘటిత కార్మికులు 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లల వీరి వేతన సవరణ 2000 సంవత్సరం లో జరిగిందని 1978 నుండి 1991 వరకు 13 రూపాయల 75 పైసలు కార్మికులకు వీడిఏ మూడు రూపాల 75 పైసలు నుండి 8 రూపాయల 75 పైసల వరకు 14,500 చెల్లిస్తున్నారని దీనివల్ల అసంఘటిత కార్మికులు దాదాపు 12 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని బిక్షపతి అన్నారు శనివారం ఎన్ టి పి సి లో మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యాలు లాభపడుతూ కార్మికులకు పనితి తగ్గ వేదనాలు సవరణ చేయలేక వెట్టిచాకిరి చేస్తున్నారని దేవసాని బిక్షపతి అన్నారు. ఈనెల 7న కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి అసంఘటిత కార్మికుల వేతనల సవరణ 2021 నుంచి సవరించాలని ప్రతిపాదించామని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వేదన సవరణ కోసం కమిటీని ఏర్పాటు చేశారని ఆ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు వివేక్ వెంకటస్వామిలు సభ్యులుగా ఉన్నారని గత కొన్నేళ్లుగా నష్టపోతున్న కార్మికులకు టాబ్లెట్ సబ్ కమిటీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆయన ఆశించారు. దేవసాని బిక్షపతి తో పాటు నాయకులు సత్యం తదితరులు ఉన్నారు